Copied!
🌷 *November 21,Today's Meditation*🌷
Ten times ten. The wheel rotates. Three wheels from one wheel. A total of four wheels. Three above and four below. Seven wheels rotate in three directions. 7 and 3 is ten.
🌷 *నవంబరు 21, నేటి ధ్యానము*🌷
🌻 అష్టవిధప్రకృతు లమరియుండును అపరాప్రకృతిగ
పరాశక్తియై పరిపాలించును జీవజగమున పరాప్రకృతియును
పరపురుషుని ప్రకృతిలీ తొమ్మిదియును
పురుషుండు ప్రకృతియు కూడి పదిగ పరిఢవిల్లు
సృష్టికర్త బ్రహ్మకు సుతులు నవబ్రహ్మలును
సాంఖ్యశక్తులుగ వర్తింత్రు ఒక్కటౌ చోటునందు
తొమ్మది నొకటియు గూడి పదియై తేజరిల్లు.
"ఒక్కటి" యన పురుషుడు ఒక్కడౌ "నేను" గాదె
"సున్న" యన సుకుమార సుందరి అమ్మ ప్రకృతియు
ఒక్కటి పదియు అగుట "నేను" అను పరషుండు జీవుడగుటయే
ఒకటికి సున్న కూడిన, పది యొకట్లై పదిగ భాసిల్లు.
ప్రజ్ఞా ప్రమాణమొక్కటియై ఒక్క పూషుడుగ ప్రకాశించు
ఆకాశ ప్రమాణము శూన్యమై యందు సూర్యుడధివసించు
ఒక్కటి తొమ్మది కలసి పదిగ పరిఢవిల్లు.
తండ్రి యొకటియై, తల్లి తొమ్మిదై పదిగ తనయుండు పుట్టునంత
అవ్యక్తమైనట్టి ఆకాశ గోళమ్ము సున్నయగును
వ్యక్తమగుచున్నట్టి వియన్మండలం బొక్కటగును.
ఒక్కటి సున్నయు పదిని ప్రభవించుచుండు
పది, పదిరెట్లుగ, పది పదిరెట్లుగ ప్రాకుచుండు
సృష్టి పరిణామమంతయు ఈ సాంఖ్య సూత్రములోన
సంతతము చక్రమై సుడులు తిరుగు.
ఒక్కటౌ అలోక చక్రమున
ఒదిగియుండు ముల్లోకములను మూడు చక్రములు
ఓంకారమూర్తులౌ మూడు వ్యాహృతులివి
భూర్భువస్సువర్లోకములివి
ద్రవ్యంబు, ప్రాణము, ప్రజ్ఞయై పరగుచుండు
ప్రేమాలయము హృదయము
అజపమూలమనాహతము
అధశ్చక్రములు మూడును
ఆవిర్భవించును అనాహతము నుండి
అధశ్చక్రత్రిపుటియు, అనాహతమ్మును కలసి
అలరారుచుండు చతుశ్చక్రసంపుటిగ
అనాహతము నారోహించిన
ఆ పైనగలవు ఊర్ధ్వ కేంద్ర త్రిపుటి
విశుద్ధి నాజ్ఞయు మరి సహస్రారంబు
మూడు నాలుగు కూడి ఏడుగ వెలుగొందు
ఇవియె సప్తవ్యాహృతులివియె ఏడుకొండలు
ఏడుకొండలపైన ఎల్లయునేలెడు స్వామి వెలసియుండు
సహస్ర శీర్షుడౌ స్వామికి సహస్రదళపద్మంబు పీఠమై సొగసులీను.
ఏడుకొండల స్వామి ఏలుబడిలోన ఏడులోకములుండు.
మూడు కన్నుల దేవర ముచ్చటగనేలు ముల్లోకములను.
సప్తలోకములును సందడిగ,
మూడు దశలలోను సుడులు తిరుగు
చక్రంబులేడును, మూడు కక్ష్యలలోన చరించుచుండు
స్వరంబులేడును, మూడు స్థాయిలలోన స్వనించుచుండు
సప్తధాతలే సప్తధాతువులై
సప్తమారుతంబులై, సప్తవర్ణ కాంతులై
సంశోభించు స్థాయిలు మూడింటిలోను
ఏడు మూడును గూడి యెన్నగ పదియునగును.
ఏడుగడ ఎల్లజగతికి ఈ పదియను పూర్ణ సంఖ్య
పూర్ణమునకు ప్రతియౌ ప్రతి అమ్మయు
పన్నుగ పది ద్వారములతోడి పవిత్రమూర్తి.........✍ *మాస్టర్ ఇ.కె.* 🌻