Copied!
🌷 *September 6,Today's Meditation*🌷
Mighty crown and spear I AM. Crown is my head, I AM the head, spear is my back, I AM the tail. Crowned king I AM. I AM the shepherd. Spear–tip I AM, I AM the red sting. By me fear is killed, by me the serpent is filled.
🌷 *సెప్టెంబర్ 6, నేటి ధ్యానము*🌷
🌻 బలవద్దృఢంబగు కిరీటమ్ము నేను, బల్లెంబునేను,
నేనె కిరీటమ్ము నభోదేహమునకెల్ల.
బ్రహ్మండమ్ము భ్రమియింపజేయు బల్లెమును నేనె,
నామస్తకంబె మహికెల్ల కిరీటమ్ము.
స్వర్లోకమౌ దివియె నా శిరమ్ము.
"నేనె" సృష్టికెల్లను శీర్షమై శోభిల్లువాడ
వేలాయుధమే నా వెన్నుగా వెలయ,
"నేనె" పుచ్ఛమ్మునై పొలసి యుంటి,
"నేనె" జీవిగా దేహమును ధరియింప,
బ్రహ్మ దండంబు బల్లెమై,
వెన్నుగా విలసిల్లుగాదె.
వేలాయుధుండగు వెలుగుగా నేను వరలుచుంటి.
నా వెలుగె విస్తారమై విశ్వమయ్యె.
పృథ్వియెల్లను నా పుచ్ఛమై పొలసియుండు.
మహోన్నత కిరీటధారియౌ మహారాజును నేను,
మేషమ్ము మహిత కిరీటమై మెరయువాడ,
పసుల కాపరిని నేను, పశుపతిని నేను,
కాచుచందును నేను గొర్రెలను కృపాదండంబుతోడ.
బల్లెంపుకొనను నేను,
బ్రహ్మదండంపు భాస్వదగ్రమును నేను.
అరుణారుణ కరాళదంష్ర్టను నేను.
భయమేలనిక, బ్రహ్మమ్ముగా నేను భాసింపగాను.
సుబ్రహ్మణ్యుండనేను, స్వర్లోక స్వామికి సుతుండ నేను,
సర్పంబు పూరితంబాయె నా చేత పూర్ణంబుగాను,
సర్ప శక్తి సమారోహణమున సహస్రారమును జేరె.........✍ *మాస్టర్ ఇ.కె.* 🌻