Copied!
🌷 *December 12,Today's Meditation*🌷
Number one, the rod. Zero to one, the serpent unwinds. Number nine, the throne; number ten, the crown. Kingdom gained. Hunter becomes saint. Hunter bears pot. Light of life carried. Mind and wisdom married. Saint blesses the couple with holy water from pot.
🌷 *డిశంబరు 12, నేటి ధ్యానము*🌷
🌻 కాలసర్పపు కలిత శంఖాకృతి వలయాలలోన
కాలదేశాత్మకంబగు విశ్వమెల్ల చిక్కియుండు.
సర్పము తన వలయముల ముడువంగ
సృష్టియెల్లను శూన్యమౌ స్థితిలోన సుప్తినందు.
సర్పంబె శేషుడై స్వామికి శయనమై శోభగాంచు.
శూన్యంబుగాదది సర్వశక్తి మయమౌ పరిపూర్ణము.
ఒకటి యను సంఖ్య నిలువురేఖగా దండమై దీపించు.
శూన్యమ్మునుండి ఒకటికి సర్పమ్ము వలయాలు విప్పుకొను.
శూన్యమె వృత్తము, ఒకటియె వ్యాసమై వెలయుచుండు
శూన్యసాగరాన సందడిగ లేచిన తరంగమౌ
సృష్టి సంకల్పంబె లంబమాన వ్యాసమై శోభిల్లుచుండు.
ప్రళయపయోధిలోన పాముపైన
పవ్వళించెడిస్వామి శూన్యసంఖ్యకు పరిపాలకుండు.
పద్మనాభుని నాభి పద్మాన ప్రభవించు
బ్రహ్మప్రథమజీవుడై ఒక్కటిని పాలించువాడు.
శూన్యమగువాడె, ఒకటి యౌ స్రష్టగనవతరించు
స్రష్టమానసంబున సృష్టి సంకల్పముదయింప
సర్గము విస్తరింప ప్రభవించిరి ప్రజాపతులు, సరగ తొమ్మిది మంది.
ఒకటి నుండి తొమ్మిదికి విశ్వము విస్తారమాయె
విస్తార విశ్వప్రజ్ఞయె రాజిల్లె "విరాట్టు" గను.
శూన్యాదిదేవుడౌ పురుషుడిట్లు నవ సంఖ్యాధిదేవుడౌ
విరాట్టుగ విశ్వమయుడగుచు విలసిల్లుగాదె.
విశ్వమెల్లనొక నవద్వార పురముగ పూర్ణమయ్యె.
నవద్వారపుర సామ్రాజ్య సింహాసనంబు నవమసంఖ్య.
ఆదిపురుషుడౌ అనంతుడు శూన్యసంఖ్యాధిదేవుండు.
ఆదిజీవుడు ఏకసంఖ్యాధిప్రజ్ఞయై అవతరించె.
పురుషుడే జీవుడై దేహమును ధరియింప,
దేహమ్ము నవద్వారపురమై పునః పునః దహ్యమగుచుసాగె.
దహ్యమౌ దేహమె తానును మోహమున జిక్కుజీవుడు
తానన పురుషుడును సత్యమ్ము తలపకుండె,
సదానందసామ్రాజ్య సింహాసనము స్థిరముగాకుండె.
శంబరాసుర మాయా మహిమయిది.
నవద్వారపురమౌ దేహమున జిక్కునాశసరణియిది.
ఇక ఒకటియౌ జీవుండు, శూన్యాధిదేవుడౌ స్వామి విష్ణుని స్మరియించె.
సర్వమ్ము విష్ణుమయమని సందర్శనము సందడించె.
సత్యజ్ఞానస్ఫురణ, శాంబరీ మాయకు స్థానమేలేదు.
ఒకటి, సున్నయు కలసి పదియై పరిఢవిల్ల,
నవమాంకంబు 'నా' లోనలయమునందె.
నరుడిక వేరుగాక, నారాయణునిలోన కరగినర్తించె,
పదియను సంఖ్యలోన ఒకటి, సున్నయు చేరినను,
ఒక సంఖ్యగా ఒదిగియుండు
నారాయణునిలోన నణగిన నరునియందు
ఇర్వురికలేరు, ఒక్కరై ఆనందసాగరాన ఓలలాడె.
ఇదియె ఇంద్రా విష్ణుని విజయగాధ.
ఇదియె నరనారాయణ ఋషుల రమ్యగాధ.
ఇదియె కృష్ణార్జునుల కమనీయ కథ.
అంత దేహ ప్రకృతికి దాసుడుకాడిక నరుడు,
దానికి స్వామియై శోభగాంచె,
దివ్యకిరీటధారియై దీప్తినందె,
సదానందస్వారాజ్యంబు సత్యముగ సహవసించె.
మృగయుండు మహాయోగిగ మార్పుచెందె.
జీవుడు పరమర్షిగా పరిణమించె.
మృగయుండు మట్టికుండను భరించె.
జీవన నవోజ్జీవకాంతి
కుంభమున కళకళలాడుచు కానవచ్చె.
ఐహికమానవుని అధ్యాత్మమానవునిగ
ఆదరించు ఆత్మజ్ఞాన జ్యోతియది.
అర్పింతంబయ్యెను ఆత్మకు బుద్ధి
లోకాలనుగన్న లోవెలుగు
'ధీ' యను దివ్వెలో దీప్తిచెందె
'ధీ' యను దర్పణమున దర్శనంబయ్యెను
దివినుండి దిగివచ్చు దివ్యజ్ఞానదీధితి.
బుద్ధికంకితమైన మనస్సును
మనువాడె మహితదివ్యజ్ఞానమ్ము.
కల్యాణమునుగని వీరి కరుణించెను కుంభజుండు.
కాలుష్యమేమియు కానరాక,
నింగినందు వెలసిన నిర్మల వైద్యుతాగ్ని
మిత్రావరుణుల మిశ్రకృషితోడ,
మిన్నేటి నీటిగా మంటికి దిగసాగె.
వరుణదేవుని వరేణ్యమౌ కరుణతోడ
నింగిలోదాగిన నిర్మల జ్ఞానాగ్ని
కుంభమున వెలువడు,
క్రొంగ్రొత్తదౌ కాంతి ధారయై.
కుంభస్థమౌ దివ్యకాంతి తీర్థమును.
కృపతోడ దంపతులకనుగ్రహించు కుంభజుండు.
కుంభసంభవ మౌని కూరిమిదీవింప.
తూర్పుపడమరల మేలు కలయిక,
చేతనా ద్రవ్యముల చిత్ర పరివర్తనంబు,
పరమాణువు పరమ శక్తుల పరిణయంబు.
ఆత్మవిద్యయు, అణువిద్యల ఐక్యభావంబు.
ధరణిని విలసిల్ల వెలయు
పరిపూర్ణ మానవుండు పవిత్రమౌ కుంభయుగాన..........✍ *మాస్టర్ ఇ.కె.* 🌻