Copied!
*కొన్ని ఇండ్లలో భార్యకు వేరే Account. భర్తకు వేరే Account. భార్య పొలాలు వేరు, వాళ్ళ నాన్నగారిచ్చినవి; భర్త పొలాలు వేరు, వాళ్ళ నాన్నగారిచ్చినవి. పాపం మావాడొకడు తెలియక ఒకాయన దగ్గర ఒక వంద రూపాయలు అర్జంటుగా, నే ఊళ్ళో లేకపోతే, మందులకోసం అప్పుతీసుకున్నాడు. తీసుకున్నవాడు నాతో చెప్పొచ్చునా? వారం రోజుల్లో ఇస్తానన్నాడు. సరే వారం రోజుల్లోనే, ఆరు రోజుల్లోనే ఇచ్చాడు. తీసుకెళ్ళి ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య కిచ్చాడు. దానిమీద పెద్ద గలాభా అయిపోయింది. వీడి మీద ఆయన నాకు Complaint. తీసుకున్నది నా దగ్గరండీ, ఇచ్చిందేమో మా ఆవిడకిచ్చాడు. What does he mean? అన్నాడు. అంటే మీరు చెబుతున్నటువంటి విద్య, ఒక వెయ్యి సంవత్సరాలు చెప్పినా, పుఠం ఎక్కించినా వాడికెక్కదు, He is a fool, అంచేత వాడిని క్షమించండి అని చెప్పాను. ఎందుకంటే పతంజలి చెప్పేటువంటి విద్య వాడికి పుఠం పెట్టినా ఎలా అయితే ఎక్కదో, వాడు చెప్పేది వీడికి అలాగే ఎక్కదు. అంచేత అలా కాదండి అర్థం, భార్య అనగా ఎంత, భర్త అనగా ఎంతంటే, సంతోషించాంలే అంటాడు. అంటే ఆ జన్మకు నోచుకోలేదు వాళ్ళు, భార్యాభర్తలని పేరే గాని.ఆయన అల్జీరియాలో ఉంటూ ఉంటాడు, ఆవిడ పెదవాల్తేరులో ఉంటూ ఉంటుంది. పన్నెండేళ్ళు అయింది. నా Wife, children అంటూ ఉంటాడు. అంటే Actual గానా, Virtual గానా? అందుకని Wife ఏమిటి, Children ఏమిటి పిండాకూడు? వాడు పన్నెండేళ్ళ నుంచి అల్జీరియాలో ఉన్నాడు, భార్యాపిల్లలు ఇక్కడ పెదవాల్తేరులో ఉన్నారు. అంటే Wife, children అనేటువంటివి వాడి మనస్సులో ఉన్నటువంటి ప్రతిబింబములు మాత్రమే. అంటే వాటితోనే నూటికి ఎనభై పాళ్ళు బ్రతకడానికి అవే కారణంగా బ్రతుకుతూ ఉంటారు. తొంభై పాళ్ళు కూడా, కొంతమంది తొంభై ఐదు పాళ్ళు కూడా. నిజంగా నిజమైనటువంటి విషయాలు అనుభవించి బ్రతికేవి జన్మ మొత్తమ్మీద ఐదు పాళ్ళు ఉంటాయి. సుఖపట్టం కోసమే కదండీ ఇంత గడ్డీ తింటుంది అంటారు. సుఖపట్టం కోసం గడ్డి తిన్నవాడెవడూ సుఖపడడు. తెల్లవారుజామున వెళ్ళిపోతాను ఇంట్లోంచి, అక్కడ ఆఫీసులో Overtime చేస్తాను. సాయంత్రం ఐదింటిదాకా అయిన తర్వాత, రాత్రి పదింటిదాకా కూడా Overtime చేస్తాను. ఎందుకు చేస్తానంటే Overtime కి, ఇంకొక ఇరవై రూపాయలెక్కువ ఇస్తారు, తర్వాత భోజనం ఇంటి దగ్గర చేయక్కర్లేకుండా పురోహితుడు చేసినట్టు చేయచ్చు. అంటే అక్కడ శాండ్విచ్చెస్ ఇస్తారు, మధ్యాహ్నమేమో ఆ నూనె పోసి వండిన కేఫ్టీరియా ఉంటుంది. అందులో Vegetarian, non-vegetarian ఒక భాండీలోనే వేపినటువంటి దాంతో శుభ్రంగా భోంచేయచ్చు. నాబోటి ఆచార్యులుగారైనా సరే, వెజిటేరియనే పెడతారు గాని, రెండూ ఒక దాంట్లోనేగా వేయించేది! కోప్పడకండి. అది చేయొచ్చు. అది అయిం తర్వాత, సాయంత్రం కూడ, ఇంటికొచ్చేటప్పుడు ఆ టీ, శాండ్విచ్చెస్ తీసుకోవచ్చు. ఇంక ఇంటిదగ్గర టిఫిన్, కాఫీ అట్లాంటివేం ఖర్చుండవు. తర్వాత ఇన్ని గంటలు పనిచేసేటప్పటికి వారానికి ఒకటో, రెండో చొప్పున కాంప్లాన్ డబ్బాలు ఇచ్చేవాళ్ళు ఇదివరకు. అవి పట్టుకొచ్చుకోవచ్చు ఇంటికి. వెనకటి రోజుల్లో ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళని ఇంటిదగ్గర భోంచేయడానికి వస్తే చాట కొట్టేది భార్య. అది చిన్న పన్నా. ఇది పెద్ద పన్నా ఇప్పుడు మనం చెప్పేది. అంతే తేడా. ఎందుకని? ఎక్కడా ఆ మాత్రం నువ్వు చేసే పౌరోహిత్యంతో భోజనం పుట్టించుకోలేవా? అసమర్థుడా, అప్రాచ్యుడా అది ఆవిడ ఉద్దేశ్యం. అది కొంచెం చిన్న పన్నా, భోజనం మాత్రమే. ఇది చాలా బహు విశ్వతోముఖమైనటువంటి కక్కుర్తి. అంటే దానికి పది రెట్లో, ఇరవై రెట్లో కక్కుర్తి అన్నమాట ఇది. అంటే కల్చర్ ఎక్కువవుతున్న కొద్దీ కక్కుర్తి కూడ ఎక్కువ అవుతుంది. అప్పుడు కక్కుర్తి భోజనానికి ఒక్కదానికే పడేవాళ్ళు అంతే. అంతే తెలుసు, ఇంకేం తెలియదు. క్రమంగా తెలివితేటలు Magnify అయ్యేటప్పటికి, డబ్బుకిమొదలైన వాటన్నిటికీ, ఎంతిస్తే అంతాన్నూ తీసుకునేది, తీసుకుని వాడు వేయవలసినటువంటి వాడికే ఓటు వేశాడా, లేదా? మరి అది చేస్తారా వెనకటి రోజుల్లో? “నాకొద్దు నువ్విచ్చేది. ఎందుకంటే నాకు తోచినవాడికి నేనేస్తాను” అని చెప్పే పిచ్చివెధవలు. అంటే మనం గమనించుకుని చూడాలన్నమాట. వీడు(పతంజలి) యోగాభ్యాసము వ్రాసింది అలాంటి వాళ్ళ కోసం.*
🪶 *మాస్టర్ ఇ.కె.*